Tuesday, 5 June, 2007

 

భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని,
వైప్లవ్యగీతాన్ని నేను!
స్మరిస్తే పద్యం,
అరిస్తే వాద్యం,
అనల వేదికముందు అస్రనైవేద్యం!


లోకాలు, భవభూతి శ్లోకాలు,
పరమేష్ఠి జూకాలు నా మహోద్రేకాలు!
నా ఊహ చాంపేయమాల!
రస రాజ్యడోల!
నా ఊళ కేదారగౌళ!


గిరులు, సాగరులు, కంకేళికా మంజరులు,
ఝురులు నా సోదరులు!
నే నొక దుర్గం!
నాదొక స్వర్గం!
అనర్గళం, అనితరసాధ్యం, నా మార్గం;

Labels:


Comments: Post a Comment





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]