Sunday, 13 May, 2007

 

వేమన జ్ఞానమార్గ పద్యములు - మొదటి భాగము (Verses of Vemana -Part 1)

కవిస్తౌత్యము
శివకవులకు నవకవులకు
శివభక్తికి తత్వమును చింతామణికి
శివలోక ప్రమథులకును
శివునకు గురువునకు శరణుసేయర వేమా.
To the sainted Bards, to the nine poets, to the Siva creed, to his essence, and to the boon-granting Gem, to those who attend in the heaven of Siva, to the god himself and to thy teacher--pray for aid of Vema.
భవదూరుడు శరభాంకుడు
శివశీలుడు వేయుగోటు సిద్ధేశ్వరుడున్
శివభృత్యుడు వటమూలుడు
శివమయచిన్మయుడు సోమశేఖరగురుడు
The unborn the salyer of sharabha endowed with qualities of Siva and the lord of a thousand millions of demigods; the servants of Siva who sitteth at the root of the sacred Banyan, He that is endowed with the mind of Siva, teh sage Somasekhara is my teacher.
[He who is exalted above mortality, the avanquisher of the Chinmaya full of blessedness, Lord of ten thousand millions of saints who is also devoted to Siva, this is he who dwelleth under the sacred Fig tree whose heart is enwrapt in bliss, the crescent crowned Teacher, that is, the Deity alone was my instructor]
శ్రీ కరంబుగ వేమన జెప్పినట్టి
పద్యములు నెవ్వడేనియు పఠన సేయు
నట్టి పురుషుడు మనమున నిట్టి దనుచు
జెప్పరానట్టి వస్తువు జేరు వేమ.
Who ever learneth the verses uttered by the sainted, this man shall attain to that object which is emphatically incomprehensible.
శ్రీకర శివతత్వ శీలుడౌ వేమన
ప్రాకటమగు వేయుపద్యములను
లోకమందు చదివి లోవెలి బాయరో
విశ్వదాభిరామ వినురవేమా !
Shall not they who read the thousand verses uttered by the venerable Vemana (who is full of divine nature) relinquish all filthy lure whether of mind or body.
వేమన జ్ఞానమార్గ పద్యములు
వేయిపద్యములు వివేకి యై భక్తితో
పఠనజేసినట్టి భక్తునకును
బాయకుండు మోక్షపద మరిచేతిదై
విశ్వదాభిరామ వినురవేమా !

He that will become a sage, and with pure faith learn these thousand verses without quitting them surely, the plcae of beatitude is put into the palm of his hand.
శతసంఖ్యపద్యముల నే
మతిమంతుడు పఠనసేయు, మమత లదరున్
అతడును నాలుగు పదవుల
శితికంఠుని పదముజేరు సిద్ధము వేమా.
That wise man who will even learn only the number of hundred verses, his appetities shall be at an end--and he by the four paths shal verily attain the abode of the Deity.
ఎన్నగ మనసే కారణ
మన్నిటికిని చూడజూడ నాత్ముడు తానౌ
యున్నంతకాల మెచ్చట
నున్నను ఇది నిజము తెలియనొప్పుగ వేమా.
Know that the mind is the universal cause. By viewing and meditating on this, a man shall himself become spirit wherever he dwelleth all his days-know weel the truth of this Vema!
సర్వము దానని తెలిపిన
నిర్వాహికి గాక ముక్తి నిలుపగ వశమా
యుర్వెల్ల్ దాను తిరిగిన
పర్వత బిల జలధులందు బడినను వేమా.
Is it in the hand of any one to attain beatitude except that perfected saint who has himself become a portion of the universe? Though those roam the whole earth, the caverns, the mountains or the waters of the great deep?
చదువులు చదివేటయ్యలు
పదవికి బొదంగలేరు పరమార్థముగా
పెదవుల గదాపకుండిన
మదిలో నిది రాజయోగ మహిమము వేమా.
The learned Brahmins who read all that is to be read, cannot yet attain heaven and the chief God. If you remain still without movig thy lips, this shall thee within thy mind, the glory of the perfected saint.
తలప మూలదుంప పరతత్వ దెల్పిన లావిగాదు లో
బలిమిని యాత్మగుట్టు మది భావన నెంచగ బ్రహ్మకల్పము
గలుగును ముక్తి జీవులకు కావున నాత్మ నిదానదృశ్య మీ
సలలిత శక్తి రూపమని సన్నుతి వేమన జేసె కల్పము
Perfect that the prime root is the first of beings whom it is out of our power to make known. If with our secret soul and the thought of our mind we meditate upon this perfect, then in the end of thine shall our whole living spirits attain beatitude. Therefore will Vemana even in his songs sings the preaches of this blessed power whose form he beholdeth in the chamber of his heart.
ఆకు చాటునుండు నన్ని లోకంబులు
కొమ్మ గానరాదు బమ్మకైన
కొమ్మ గానబడిన కొనియాడవచ్చురా
విశ్వదాభిరామ వినురవేమా !
These worlds are all like leaves veiling the branch which is hidden from the view, even of Brahma. He alone who can perceive the branch can sing its praises.

Labels: ,


Comments:
ప్రియమైన గౌరి కుమార్‌,
వేమన పద్యములను మీబ్లాగు లో చేర్చినందుకు చాల సంతోషం.ఇన్ని పద్యములులొకచోట చూచుటకు వీలుకల్పించన మీకు ధన్యవాదములు
జాబలిముని
 
Post a Comment





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]