Sunday, 13 May, 2007

 

వేమన జ్ఞానమార్గ పద్యములు - మూడవ భాగము (Verses of Vemana -Part 3)

ఆత్మబుద్దివలన నఖిలంబు తా నయ్యె
జీవబుద్ది వలన జీవుడయ్యె
మోహబుద్ధి లయము ముందర గనుకొను
విశ్వదాభిరామ వినురవేమా !

By knowledge f the great spirit he himself became all things. By the knowledge of life he became living. Let us first attain the destruction of love and opinion?

ఈ దేహమెన్ని భంగుల
బ్రోదియు నొనరొంచనేల పోవుట కాదే
మీ దెరిగి మురికి గడుగుచు
భేదంబులు మాన ముక్తి బెరయుర వేమా.

Why should ye in so many ways take care of this body? Will it not perish? If kowing futurity ye purge away your impurities putting an end to destructions ye shall attain beatitude.

పిల్లి చుంచు బట్టి ప్రియముననుండక
నదియు కోడి బట్ట నునగమించు
మమత విడవకున్న మానునా మోహంబు
విశ్వదాభిరామ వినురవేమా !

The cat having caught a muskrat delights not in it; but pursues the fowl to seize it. Without relinquishing the delights (posession) will love cease?

ఏక బ్రహ్మము నిత్యము
వైకల్పిక మైనయట్టు వస్తువు లెల్లన్
ఏకత్వం బని యెరిగిన
శోకములే కల్ల ముక్తి సులభము వేమా.

The only god is Eternal; to him who knows that all things curiously compunded are in truth the unity and afflications are as a lie and to him beatitude is easy of attainment.

మరియు దధిని ఘృతము, మానులం దనలంబు,
చారుసుమములందు సౌరభంబు
తిలల తైల మట్ల దేజరిల్లు చిదాత్మ
విశ్వదాభిరామ వినురవేమా !

Again by perfection ghee is produced from curds, fire in trees, fragrance from fine flowers and oil in seeds; thus shineth forth god the soul of intellect.

తరువ తరువ బుట్టు తరువున ననలంబు
తరువ తరువ బుట్టు దధిని ఘృతము
తలప తలప బుట్టు తనువున తత్వంబు
విశ్వదాభిరామ వినురవేమా !

By friction and friction, fire is produced in a tree. By continual agitation ghee is produced from curd. Thus by perpetual meditation shall divine wisdom be produced in our body.

జీవిని దెలిసిన దనుకను
దేవునిభ్రమ బొదలు నరుడు దేవుడు దలపన్
జీవుండని వివరించిన
భావింపగ ముక్తి బట్టబయలుర వేమా.

Until he explores his own soul, a man acts (or roams) in ignorance of God (or illusion caused by God). If by meditation you comprehend that Gos is a spirit by understanding the beatitude shall be clearly manifested to thee O Vemana.

ఇంతకాల ముండి యెరుకమాలిన జీవి
చచ్చి పుట్టుచుండు సహజ మనుచు
నెరుక మరచు చోటు నెరుగుట బ్రహ్మాంబు
విశ్వదాభిరామ వినురవేమా !

This ignorant soul (living creature) afer living so long imagines that to die and be reproduced is the course of nature. To know that heaven where we shall be so far advanced as to forget instruction. this is spirituality

మ్రానులోన నగ్ని మరి యుండవచ్చు
అగ్నినుండ మ్రాను కలవి గాదు
మ్రానులోని యగ్ని మర్యాద సంసారి
విశ్వదాభిరామ వినురవేమా !

Fir can even exist in a tree. But a tree has no power to remain where fire is. Like to fire in a tree, is the worldy state. It contains hidden the seeds of flame.

మేఘ మడ్డమైన మిహిరుని జెరచును
చిత్త మడ్డమైన స్థిరము జెరచు
మరపు లడ్డమైన మరి ముక్తి జెరచును
విశ్వదాభిరామ వినురవేమా !

If a cloud intervenes in a way destroys the sun. If your inclinations intervene, they destroy your firmness. If forgetfukness takes place, it destroys beatitude itself.

Labels: ,


Comments: Post a Comment





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]