Saturday, 12 May, 2007

 

ఘంటసాల భగవద్గీత

భగవద్గీత. మహాభారతము యొక్క సమగ్ర సారాంశము. భక్తుడైన అర్జునునకు ఒనర్చిన ఉపదేశమే గీతా సారాంశము. భరత యుధ్దము జరుగరాదని సర్వ విధముల భగవానుడు ప్రయత్నించెను. కాని ఆ మహానుభావుని ప్రయత్నములు వ్యర్థములాయెను. అటు పిమ్మట శ్రీకృష్ణుడు పార్ఠునకు సారధియై నిలిచెను.

యుద్థ రంగమున అర్జునుని కోరిక మేరకు రథమును నిలిపెను. అర్జునుడు ఉభయ సైన్యములలో గల తండ్రులను, గురువులను, మేనమామలను, సోదరులను, మనుమలను, మితృలను చూచి, హృదయము ద్రవించి

న కాంక్షే విజయం కృష్ణ న చ రాజ్యం సుఖాని చ
కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా

స్వజనమును చంపుటకు ఇష్టపడక "నాకు విజయమూ వలదు, రాజ్య సుఖమూ వలదు" అని ధనుర్బాణములను క్రింద వైచె. దుఃఖితుడైన అర్జునుని చూచి శ్రీకృష్ణ పరమాత్మ,

అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాఁశ్చ భాషసే
గతాసూనగతాసూఁశ్చ నానుశోచంతి పణ్డితాః

దుఃఖింప తగని వారిని గూర్చి దుఃఖించుట అనుచితము. ఆత్మానాత్మ వివేకులు అనిత్యములైన శరీరములను గూర్చి గాని, నిత్యములూ, శాశ్వతములూ అయిన ఆత్మలను గూర్చి గాని దుఃఖింపరు

దేహినోస్మిన్యథా దేహే కౌమారఁ యౌవనఁ జరా
తథా దేహాంతరప్రాప్తిర్ధీరస్తత్ర న ముహ్యతి
జీవునకు దేహమునందు బాల్యము, యవ్వనము, ముసలితనము యెట్లో, మరొక దేహమును పొందుట కూడా అట్లే. కనుకు ఈ విషయమున ధీరులు మోహము నొందరు

వాసాఁసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి
తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సఁయాతి నవాని దేహీ

మనుష్యుడు, ఎట్లు చినిగిన వస్త్రమును వదలి నూతన వస్త్రమును ధరించునో,అట్లే, ఆత్మ - జీర్ణమైన శరీరమును వదలి క్రొత్త శరీరమును ధరించుచున్నది.

శ్లోకం: ----
ఆత్మ నాశనములేనిది. ఆత్మను శాస్త్రములు ఛేదింపజాలవు, అగ్ని దహింప జాలదు. నీరు తడుపజాలదు. వాయువు ఆర్పివేయనూ సమర్థము కాదు. ఆత్మ నాశనము లేనిది.

శ్లోకం: ----
పుట్టిన వానికి మరణము తప్పదు. మరణించిన వానికి జన్మము తప్పదు.
అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింప తగదు.


శ్లోకం: ----
యుద్ధమున మరణించినచో వీర స్వర్గము పొందెదవు. జయించినచో
రాజ్యము భోగింతువు. కావున అర్జునా, యుద్ధము చేయ కృతనిశ్చయుడవై
లెమ్ము.

శ్లోకం: ----
కర్మలను ఆచరించుటయందే నీకు అధికారము కలదు కాని, వాని ఫలితము
పైన లేదు. నీవు కర్మ ఫలమునకు కారణము కారాదు. అట్లని, కర్మలను
చెయ్యుటా మానరాదు.
శ్లోకం: ----
దుఃఖములు కలిగినపుడు దిగులు చెందని వాడును, సుఖములు కలిగినపుడు
స్పృహ కోల్పోని వాడును, రాగమూ, భయమూ, క్రోధమో పోయినవాడును స్థిత ప్రజ్ఞుడని చెప్పబడును
శ్లోకం: ----
విషయ వాంఛలను గూర్చి సదా మననము చేయువానికి, వానియందనురాగ
మధికమై, అది కామముగా మారి, చివరకు క్రోధమగును. క్రోధము వలన
అవివేకము కలుగును. దీనివలన జ్ఞాపకశక్తి నశించి, దాని ఫలితముగా
మనుజుడు బుద్ధిని కోల్పోయి చివర్కౌ అధోగతి చెందును.
శ్లోకం: ----
ఆత్మజ్ఞానము పూర్వక కర్మానుష్ఠానము, బ్రహ్మ ప్రాప్తి సాధనము కలిగిన
జీవుడు సంసారమున బడక, సుఖైక స్వరూపమైన ఆత్మ ప్రాప్తిని చెందగలడు.
శ్లోకం: ----
అర్జునా! ఈ లోకములో ఆత్మానాత్మ వివేకముగల సన్యాసులకు జ్ఞాన యోగము
చేతను, చిత్తశుద్ధిగల యోగీశ్వరులకు కర్మ యోగము చేతను ముక్తి కలుగుచున్నదని
సృష్ఠి ఆదియందు నాచే చెప్పబడియున్నది.
శ్లోకం: ----
అన్నము వలన జంతుజాలము పుట్టును. వర్షము వలన అన్నము సమకూడును. యజ్ఞము
వలన వర్శము కలుగును. ఆ యజ్ఞము కర్మ వలననే సంభవము.
శ్లోకం: ----
పార్ధా! నాచే నడుపబడు ఈ లోకము అను చక్రమునుబట్టి, ఎవడు అనుసరింఒఅడో
వాడు ఇంద్రియలోలుడై పాప జీననుడగుచున్నాడు. అట్టివాడు వ్యర్ధుడు. జ్ఞాని
కానివాడు సదా కర్మలనాచరించుచునే యుండవలెను.
శ్లోకం: ----
ఉత్తములు అయినవారు దేని నాచరింతురో, దానినే ఇతరులును ఆచరింతురు. ఉత్తములు
దేనిని ప్రమాణముగా అంగీకరింతురో, లోకమంతయూ దానినే అనుసరింతును.
శ్లోకం: ----
అర్జునా! నేవొనర్చు సమస్త కర్మలనూ నాయందు సమర్పించి, జ్ఞానముచే
నిష్కాముడవై, అహంకారము లేనివాడవై, సంతాపమును వదిలి యుద్ధము చేయుము.
శ్లోకం: ----
చక్కగా అనుష్ఠింపబడిన పరధర్మముకన్న, గుణము లేనిదైననూ స్వధర్మమే మేలు.
అట్టి ధర్మాచారణమున మరణము సంభవించిననూ మేలే. పరధర్మము
భయంకరమైనది. ఆచరణకు అనుచితమైనది.
శ్లోకం: ----
పొగచేత అగ్ని, మురికిచేత అద్దము, మావిచేత శిశువు యెట్లు కప్పబడునో, అట్లే
కామముచేత జ్ఞానము కప్పబడియున్నది.
శ్లోకం: ----
ఏ కాలమున ధర్మమునకు హాని కలుగునో, అధర్మము వృద్ధి నొందునో అయా
సమయములందు శిష్ఠరక్షణా, దుష్ఠశిక్షణా, ధర్మసంరక్షణముల కొరకు
ప్రతి యుగమున అవతారమును దాల్చుచున్నాను.
శ్లోకం: ----
అనురాగమూ, భయమూ, క్రోధమూ వదిలి నాయందు మనస్సు లగ్నము చేసి
ఆశ్రయించిన సత్పురుషులు జ్ఞానయోగముచేత పరిశుద్ధులై నా సాన్నిధ్యమును
పొందిరి.
శ్లోకం: ----
ఎవరెవరు యేయే విధముగా నన్ను తెలియగోరుచున్నారో, వారిని ఆయా విధములుగా
నేను అనుగ్రహించుచున్నాను. కాని, ఏ ఒక్కనియందును అనురాగము కాని, ద్వేషము
కాని లేదు.
శ్లోకం: ----

Labels:


This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]