Sunday, 10 June, 2007

 

సుమతీ శతకము

శ్రీ రాముని దయచేతను
నారూఢిగ సకల జనులు నౌరా యనగాఁ
ధారళమైన నీతులు
నోరూరగఁ జవులుబుట్ట నుడివెద సుమతీ


ఓ మంచి గుణాలు గలవాడా! శ్రీ రామచంద్రుని యొక్క దయ చేత, ప్రజలందరు ఆశ్చర్యపడునట్లు ప్రఖ్యాతమైన ధారళమైన నీతులను, వినువారికి నోరు నుండి నీళ్ళు ఊరునట్టి విధముగా తెలిపెదను.


ఉత్తమ గుణములు నీచున
కెత్తెఱఁగున గలుగనేర్చు నెయ్యెడలన్ దా
నెత్తిచ్చి కఱఁగి పోసిన
నిత్తడి బంగార మగునె యిలలో సుమతీ


అల్ప బుద్దిగల నీచునికి ఏ విధముగా ఏమి చేసినను మంచి బుద్దులు రావు, ఇత్తడికి సమానముగా బంగారమును తీసుకొని ఎంత కరిగించి పోసినను అది బంగారమునకు సాటి రాదు. అలాగే నీచుడు కూడా.గడనగల మగనిఁ జూచిన
నడుగడుగున మడుగులిడుదు రతివలు ధరలోఁ
గడనుడుగు మగనిఁజూచిన
నడపీనుఁగు వచ్చెననుచ నగుదురు సుమతీసంపాదన కలిగి ఉన్నన్నాళ్లు మగడికి అడుగులకు మడుగులు ఒత్తి ఆదరించి గౌరవించుతుంది భార్య. అదే ఖర్మకాలి ఆ భర్త సంపాయించలేని వాడయినపుడు ఆమె చేసే అపహాస్యము అంతా ఇంతా కాదు.పెట్టిన దినముల లోపల
నట్టడవులకైన వచ్చు నానార్ధములున్
బెట్టని దినములఁ గనకపు
గట్టెక్కిన నేమిలేదు గదరా సుమతీక్రిందటి జన్మమున తాను చేసిన దానము నట్టడివి మధ్యనున్నప్పటికినీ అక్కడ వారికి సకల పదార్ధములు కలుగును. పూర్వజన్మమున దానమీయకున్నచో తాను బంగారము కొండ నెక్కినను ఏమి ప్రయోజనము ఉండదు.
వినదగు నెవ్వరు చెప్పిన
వినినంతనె వేగపడక వివరింపఁదగున్
గని కల్ల నిజము దెలిసిన
మనుజుఁడెపో నీతిపరుడు మహిలో సుమతీఎంతమంది చెప్పినను శాంతముతో వాటిని వినవలెను. విన్న తరువాత తొందర పడక వాటిలోని నిజనిజాలను తరచి ఆలోచించి అర్ధం చేసుకోవాలి. ఆవిధముగా చేసినవాడే నిజమైన బుద్ధిమంతుడుగా భూమియందు ఎంచబడుతాడు.
బలవంతుఁడ నాకేమని
బలువురతో నిగ్రహొంచి పలుకుట మేలా?
బలవంతమైన సర్పము
చలిచీమల చేతఁజిక్కి చావదె సుమతీబలవంతమైన వ్యక్తి తాను బలవంతుడిని అను అహంకారపడితే, పాము ఎంత బలం కలిగి ఉన్నప్పటికినీ చలిచీమలచేత పట్టుబడి చచ్చినట్లే, వాడి పరిస్ధితి అగును. కాబట్టి బలంతో అందరితో వైరము తెచ్చుకోనుట బుద్ధితక్కువ. అది మేలు కాదు.
పతికడకు, తన్నుఁగూర్చిన
సతికడకును, వేల్పుఁకడకు, సద్గురు కడకున్,
సుతుకడకు, రిత్తచేతుల
మతిమంతులు చనరు, నీతి మార్గము సుమతీ


న్యాయమైన బుద్ధి గలవారు, యజమాని దగ్గరకును, అధికంగా ప్రేమించే తన భార్య యొద్దకును, మనలను రక్షించు భగవంతుని దగరకు, విద్యను బోధించు గురువు కడకును, పుత్రుని దగ్గరకును వట్టిచేతులతో వెళ్ళరు, ఇది అందరూ పాటించవలసిన నీతి, (రాజ) మార్గము.

తాననుభవింప నర్ధము
మానవపతిజేరు గొంత మఱి భూగతమౌ
గానల నీగలు గూర్చిన
తేనియు యెరుజేరునట్లు తిరముగ సుమతీలోభత్వముతో కూడాబెట్టిన ధనము ఏ విధముగానయితే తేనెటీగలు అరణ్యములలో చేర్చియుంచిన తేనె ఇతరులకు చేరునో, అలాగే కొంత రాజులపాలు, మరికొంత నేలపాలు యగును.చీమలు పెట్టిన పుట్టలు
పాముల కిరవైనయట్లు పామరుఁడుదగన్
హేమంబుఁ గూడఁ బెట్టిన
భూమీశుల పాలఁజేరు భువిలో సుమతీపాములు, చీమలు ఎంతో కష్టపడి నిర్మించుకున్న పుట్టలను ఏ విధముగానయితే ఆక్రమించుకుని నివాస స్థానముగా మార్చుకుంటాయో, పామరుడు దాచిపెట్టుకున్న ధనము అదే విధముగా రాజుల ఖజానాలోకి వెళ్ళి తీరుతుంది.తనయూరి తపసితనమును
దనబుత్రుని విద్యపెంపుఁ, దన సతి రూపున్
దన పెరటి చెట్టు మందును,
మనసున వర్ణింపరెట్టి మనుజులు సుమతీమనిషి తను ఉండే చోటు యొక్క మహత్మ్యమును, తపోబిష్టను, తన కుటుంబములోని కుమారును యొక్క అభివృద్ధిని, విజ్ఞానమును, ఇంటనున్న భార్య అందమును, ఇంటి గుమ్మమందు ఉన్న యొక్క ఔషధ గుణములను గుర్తించలేడు, గొప్పవిగా భావింపలేడు.

కవి గానివాని వ్రాతయు
నవరసభావములు లేని నాతులవలపున్
దవిలి చని పంది నేయని
వివిధాయుధకౌశలంబు వృథరా సుమతీవ్యర్ధములగు వస్తువులు ఏమిటో ఈ భావమునందు తెలుసుకుందాము. కవి కాని వాడు చేయు రచనలు, వివిధ భావములను పలికించలేని స్త్రీ యొక్క ప్రేమను, వెంటాడి వేటాడి వివిధాయుధాల నైపుణ్యముచే అడవిపందిని కొట్టలేని పురుషులు వారి యొక్క విద్యా కౌశలము ఎందుకూ పనికిరావు.ఉదకముఁ ద్రావెడు హయమును
మదమున నుప్పొంగుచుండు మత్తేభంబున్
మొదవుకడ నున్న వృషభముఁ
జదువని యా నీచుకడకుఁ జనకుర సుమతీ


దాహముతో మంచినీటిని త్రాగున్తున్న గుఱ్ఱము దగ్గరకు, క్రొవెక్కి మదముతో బలిసి యున్న ఏనుగు దగ్గరకు, ఆవు దగ్గరకు వచ్చిన ఆంబోతు దగ్గరకు, విద్యా బుద్దులు లేనివంటొ హీనుని వద్దకు పోకూడదు. (అటువంటి వారి వద్దకు పోయిన లెనిపోని ఆపద చుట్టుకొనును).


ఒల్లని సతి నొల్లని పతి
నొల్లని చెలికాని విడువ నొల్ల నివాఁడే
గొల్లండుఁ గాక ధరలో
గొల్లండుఁను గొల్లడౌనెగుణమున సుమతీతనంటే ఇష్టపడని భార్యను, తనయందు నమ్మకమును నిలుపుకోని రాజును, అయిష్టతను చూపే స్నేహితుడిని వదిలివేయుటకు మన్సు ఒప్పుకొననివాడు అజ్ఞాని (గొల్లవాడు) అగును. అంతేకాని గొల్లకులములో పుట్టినంత మాత్రాన అజ్ఞాని కాడు.కోమలి విశ్వాసంబునఁ
బాములతోఁజెలిమిఁయన్య భామల వలపున్
వేముల తియ్యదనంబును
భూమీశుల నమ్మికలును బొంకుర సుమతీలోకములో అన్నింటియందు నమ్మకమును ఉంచకూడదు అను అర్ధమునకు ఈ క్రింది వాటినే తార్కాణముగా తీసుకోవచ్చును. ఆడదాని యొక్క నమ్మకమును, పాములతో స్నేహమును, పర స్త్రీల యొక్క ప్రేమయందు, వేపచెట్టు యొక్క తియ్యదనమునందు, రాజుల యొక్క విశ్వాసమును నిజము కాదు.పరనారీ సోదరుఁడై
పరధనముల కాసపడక, పరులకు హితుఁడై
పరులుఁ దనుఁబొగడ నెగడకఁ,
బరు లలిగిన నలుగకతఁడు, పరముఁడు సుమతీ


ఉత్తముడైన మనుషుడు పరస్త్రీలకు తోడబుట్టినవాడై, పరుల ధనము ఆశించకుండా, ఇతరులకు మిత్రుడై, తనను పొగిడినచో ఉబ్బితబ్బిబ్బయిపోక, ఇతరులు అలిగిననూ తాను అలకవహించనివాడు అవితాడు.రూపించి పలికి బొంకకు
ప్రాపగు చుట్టంబు కెగ్గు పలుకకు మదిలో
గోపించు రాజుఁ గొల్వకు
పాపపు దేశంబు సొరకు పదిలము సుమతీనిర్దారణ చేసి మాట్లాడిన తరువాత అసత్యమాడకుము. అండగానుండు బంధువులకు అపకారము చేయకుము. కోపగించు ప్రభువునకు సేవ చేయకుము. పాపాత్ములు సంచరించు ప్రదేశమునకు వెళ్ళకుము.
వరిపంటలేని యూరును
దొరయుండని యూరు, తోడు దొరకని తెరువున్
ధరను బతిలేని గృహమును,
నరయంగా రుద్రభూమి యనదగు సుమతీవరిపంటలేని ఊరు, అధికారియుండని గ్రామము, సహవాసం దొరకని మార్గము, యజమాని లేని ఇల్లు వల్లకాడుతో సమానము.

మానధను డాత్మధృతి చెడి
హీనుండగు వాని నాశ్రయించుట యెల్లన్
మానెడుఁ జలముల లోపల
నేనుగు మెయిదాచినట్టు లెరుగము సుమతీఏనుగు తన శరీరమును చాలే చాలని నీటిలీ దాచుకొనునా? అదేవిధంగా ఆత్మాభిమానం గలిగిన ఉత్తమ పురుషుడు హృదయమునందలి ధీరత్వమును విదిచిపెట్టి నీచుడిని ఎంత మాత్రము సేవింపడు.
పరసతి కూటమిఁ గోరకు,
పర్ధనముల కాసపడకు, పరునెంచకుమీ
సరిగాని గోష్టి చేయకు
సిరిచెడి చుట్టంబుకడకు జేరకు సుమతీఎవరైనా సరే పరభార్యల పొందును ఆశించకుము. ఇతరుల ధనుమునకు ఆశ పడకు. సరి గని మాటలు ఆడవలదు. ధనము పోయి చుట్టముల వద్దకు చేరకు.
తన కలిమి యింద్రభోగము
తనలేమియే సర్వలోక దారిద్ర్యంబున్
తన చావు జగత్ప్రళయము
తను వలచిన యదియెరంభ తథ్యము సుమతీ
మానవుడు తనకు కలిగినటువంటి సంపద ఇంద్రునకి ఉన్నంతటి ఐశ్వర్యముతో సమానమని, తనకు కలిగిన పేదరికము ప్రపంచమున ఉన్నటువంటి గొప్ప బీదరికము వంటిదని, తన చావే ప్రపంచమునకు గొప్ప ప్రళయముగాను, తాను ఇష్టపడిన స్త్రీ రంభ యంతటి సౌందర్యవతియను భావించును.


కరణముల ననుసరింపక
విరసంబునఁ దిన్నతిండి వికటించుఁజుమీ
యిరుసునఁ గందెన బెట్టక
పరమేశ్వరు బండియైనఁ బాఱదు సుమతీ


బండి ఎవరిదైననూ యిరుసులో కందెనను బెట్టనిదే పరిగెత్తదు. చివరికి అది పరమేశ్ర్వరుని బండి అయినను. అట్లే భూస్వాములు కరణమును అనుసరించి బ్రతుకకున్న యెడల కష్టములు సంభవించును.అల్లుని మంచితనంబున
గొల్లని సాహిత్యవిద్య కోమలి నిజమున్
బొల్లున దంచిన బియ్యముఁ
దెల్లని కాకులును లేవు తెలియము సుమతీఅల్లుడు మంచి గుణముతో గొప్పవాడుగా నుండుట, గొల్లవాడు భాషా జ్ఞానము గలవాడుగా అగుట, ఆడది ఎప్పుడూ నిజము చెప్పుట, ఊకను దంపగా వచ్చిన బియ్యము, తెల్లని రంగు కలిగిన కాకులను ప్రపంచమునందు ఉండవని గ్రహించి మానవులు మెలగవలయును.కసుగాయఁ గఱచి చూచిన
మసలకఁతగు యెగరుఁగాక మధురంబగునా
పస గలుగు యువతులుండగఁ
బసిబాలలఁబొందువాడు పశువుర సుమతీఆడవారి విషయములో వయసు తారతమ్యమును ఎంచకుండా ప్రవర్తించే మగవారిని ఈ క్రింది విధముగా పోల్చుచున్నారు ఈ భావమునందు. పక్వమునకు వచ్చిన పండ్లు ఉండగ పక్వమునకురాని పండ్లను కొఱికి చూచిన అవి తియ్యగా ఉంటాయా? అలాగే లోకంలో వయసుకు వచ్చిన ఆడవారు ఉండగా పసి బాలికలను అనుభవించు మనుజుడు పశువుతో సమానమగును.తలపొడుగు ధనము బోసిన
వెలయాలికి నిజములేదు వివరింపంగా
దలఁదడివి బాసఁజేసిన
వెలయాలిని నమ్మరాదు వినరా సుమతీవ్యభిచారిణి నిలువెత్తు ధనము ధారపోసినను నిజము చెప్పలేదు. వేశ్య తలమీద చేయి వేసుకొని ప్రమాణము చేసినను ఆమె మాటలు నమ్మరాదు.పా టెరుగని పతి కొలువును
గూటంబున కెఱుకపడని గోమలి రతియన్
జేటెత్త జేయు జెలిమియు
నేటికి నెదురీదనట్టు లెన్నగ సుమతీ


క్రూరుడై తను చేసే పని యందలి కష్టసుఖములు తెలుసుకోలేని అధికారి వద్ద కొలువు, కూటమి తెలియనటువంటి స్త్రీ యొక్క పొందు, అపాయము తప్పదనుకొను స్నేహమును లోతుగా ఆలోచిస్తే నదికి నదికి ఎదురీదినంత కష్టము.


వఱదైన చేను దున్నకు
కరవైనను బంధుజనులకడ కేగకుమీ
పరులకు మర్మము సెప్పకు
పిఱికికి దళవాయితనము బెట్టకు సుమతీవరద వచ్చినపుడు పొలము దున్నకు, కరవు కాలమునందు కోరి బంధువుల కడకు చేరకు. ఇతరులకు రహస్యము తెలుపకు. పిరికివాడికి సేనాధిపత్యము కట్టబెట్టకు.పనిచేయు నెడల దాసియు
ననుభవమున రంభ మంత్రి యాలోచనలన్
దనభుక్తి యెడలఁదల్లియు
యనదగు కులకాంత యుండనగురా సుమతీ


సద్గుణవతియైన ఉత్తమ ఇల్లాలు - ఇంతి పనులు చేయునపుడు సేవకురాలిగను, సంభోగించునప్పుడు రంభవలెను, సలహాలు చెప్పునప్పుడు మంత్రివలెను, తినువేళ్ళలో తల్లివలెను ఉండవలయును.


తలనుండు విషము ఫణికిని
వెలయంగాఁ దోకనుండు వృశ్చికమునకున్
దల దోఁక యనకనుండును
ఖలునకు నిలువెల్ల విషముగదరా సుమతీ


దుర్మార్గుడైన మనిషికి నిలువెల్లా విషమే ఊంటుంది. ఇటువంటి వాడికంటే తలయందు విషముండు పాము, తోకయందు తేలు నయము.కాదు సుమీ దుస్సంగతి
పోదుసుమీ కీర్తికాంత పొందిన పిదపన్
వాదు సుమీ యప్పిచ్చుట
లేదుసుమీ సతులవలపు లేశము సుమతీ


దుష్టబుద్ధి గలవారితో స్నేహము చేయనే కూడదు. కీర్తి ఒకసారి తనదయిన తరువాత వద్దన్నా మరలిపోదు. ఋణము ఇవ్వటమంటే శత్రుత్వమును కోరి కొనుక్కోవటమే అవుతుంది. స్త్రీల ప్రేమ కొంచెమయిననూ ఉండదు.ఉపమింప మొదలు తియ్యన
కపటంబెడ నెడను జెఱకు కైవడినే పో
నెపములు వెదుకునుఁ గడపటఁ
గపటపు దుర్జాతి పొందు గదరా సుమతీచెడ్డవానితో స్నేహము చెరుకగడ మొదట కొంచెం తీయగా వుండి మధ్య మధ్యలో కణుపుల వద్ద తీపి హరించి చివరికి వచ్చినపుడు ఏ విధముగానయితే చప్పగా అయిపోవునో అదే విధముగా అవుతుంది.అధరము కదలియుఁగదలక
మధురములగు భాషలుడిగి మౌనవ్రతుడౌ
నధికార రోగపూరిత
బధిరాంధక శవముఁజూడ బాపము సుమతీపెదవి కదలకుండగనే మంచి మాటలను వదిలి, అధికారముచే మౌనవ్రతమును పట్టిన నియమముగా గల్గినటువంటి అధికారి - చెవులు ఉన్నను వినిపించని వాని వలె, కండ్లు ఉన్నను కనిపించని వానివలెను, పెదవి కదల్చక జీవము లేనటువంటి శరీరము సమానమే యగుటచేత అటువంటి అధికారి దర్శన మాత్రము చేతనే అనేక పాపములు చుట్టుకొనును.


ఎప్పుడు దప్పులు వెదకెడు
నప్పురుషునిఁ గొల్వఁగూడ నది యెట్లన్నన్
సర్పంబు పడగ నీడను
గప్పవసించు విధంబు గదరా సుమతీఎల్లవేళలా తప్పులు కనిపెట్టునట్టి మనుష్యుని వద్ద పనిచేయకూడదు. ఎందుచేత ననగా కప్ప తనను మ్రింగివేయుటకు సిద్దముగానున్న పాము యొక్క పడగ క్రింద జీవించిన ఎంత అపాయమో ఆ సేవకునికి అంతే అపాయము.


కులకాంతతోడ నెప్పుడుఁ
గలహింపకుఁ వట్టి తప్పు ఘటియింపకుమీ
కలకంఠి కంటి కన్నీ
రొలికిన సిరి యింటనుండ దొల్ల్ దు సుమతీ


వివాహము చేసుకున్న భార్యతో ఎప్పుడూ తగువులాడవద్దు. లేని తప్పును ఉందని మోపరాదు. ఉత్తమ స్త్రీని భాదింపరాదు. ఆమె భాదతో కన్నీరు కార్చిన ఆ కన్నీటి బొట్టు దరిద్రమునకు కారణమగును. లక్ష్మి ఇంట నుండుటకు అయిష్టపడుతుంది.ధీరులకుఁ జేయు మేలది
సారంబగు నారికేళ సలిలము భంగిన్
గౌరవమును మఱి మీఁదట
భూరిసుఖావహము నగును భువిలో సుమతీకొబ్బరు చెట్టుకు నీరు పోసినచో ఉత్తముములైన నీరుగల కాయలను ఇచ్చును. ఆ విధంగానే బుద్ధిమంతులకు జేసిన ఉపకారము మర్యాదయును తరువాత మిక్కిలి సుఖములను కలిగించును.కూరిమిగల దినములలో
నేరములెన్నఁడునుఁ గలుగ నేరవు మఱి యా
కూరిమి విరసంబైనను
నేరములే తోచుచుండు నిక్కము సుమతీస్నేహముగా ఉన్న సమయములో ఎదుటి వ్యక్తి ఏమి చేసినను అందులో ఏ దోషములు కనపడవు. పొరపాటున ఏదన్నా విషయములో గొడవ ఏర్పడి శత్రుత్వము కలిగినప్పుడు ఎదుటి వ్యక్తి చేసే ప్రతి పనిలో తప్పులే కనబడును.

ఏఱకుమీ కసుగాయలు
దూఱకుమీ బంధుజనుల, దోషము సుమ్మీ
పాఱకుమీ రణమందున
మీఱకుమీ గురువులాజ్ఞ మేదినీ సుమతీ


పండకుండా దోరగా ఉన్నటువంటి కాయలను కోయరాదు. చుట్టములతో పరుషముగా వ్యవహరించి వారిని నిందింపకూడదు. పోరునందు పిరికివానివలె వెన్ను చూపి పారిపోరాదు. గురువుల ఆజ్ఞను దైవాజ్ఞగా భావించి వారు చెప్పిన విధముగా ప్రవర్తింపుము. వారి ఆజ్ఞను మీరవలదు.ఇచ్చునదె విద్య, రణమున
జొచ్చునదే మగతనంబు, సుకవీశ్వరులున్
మెచ్చునదె నేర్పు, వాదుకు
వచ్చునదే కీడుసుమ్ము! వసుధను సుమతీ


ఇతరులకు చెప్పగలిగినవంటిదియే విద్య. యుద్ధభూమిలో ప్రవేశించునట్టిదియే ధీరత్వము. ఉత్తమ కవులు గూడా పొగిడి మెచ్చుకొనువంటిదియే నేర్పరితనము. తగవులు వచ్చు పని చేయుటయే అపాయముతో కూడిన కీడు కలిగించును సుమా.


కొఱగాని కొడుకు పుట్టినఁ
గొఱగామియొగాదు తండ్రి గుణములఁజెఱచున్
జెఱకుతుద వెన్ను పుట్టినఁ
జెఱకునఁ తీపెల్ల జెఱచు సిద్ధము సుమతీ

చెఱకు చివర యందు వెన్ను పుట్టి ఆ చెఱకు నందు ఉన్న తీపినంతటిని ఏ విధముగా పాడుచేయునో ఆ విధముగానే పనికిరాని కొడుకు పుట్టినచో వాడు పనికిరాని వాడిగా తయారవటమే కాకుండా తండ్రి సంపాదించుకున్న మంచి పేరును నాశనము చేస్తాడు.

Labels:


Comments:
సుమతీ శతకం మొత్తాన్ని అందించినందుకు ధన్యలాదములు.
 
Post a Comment

<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]