Saturday, 19 May, 2007

 

అర్థ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా

పల్లవి:
అర్థ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా
స్వర్ణోత్సవాలు చేద్దామా

పాట:
ఆత్మ వినాశాపు అరాచకాన్ని స్వరాజ్యమందామా
దానికి సలాము చేద్దామా


శాంతి కపోతపు కుత్తుక తెంచి ఇచ్చిన బహుమానం
ఈ రక్తపు సింధూరం


నీ పాపిటలో భక్తిగ దిద్దిన ప్రజలను చూడమ్మా
ఓ పవిత్ర భారతమా


అర్థ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా
స్వర్ణోత్సవాలు చేద్దామా


నిత్యం కొట్టుకు చచ్చే జనాల స్వేచ్ఛను చూద్దామా
దాన్నే స్వరాజ్యమందామా


కులాల కోసం గుంపులు కడుతూ మతాల కోసం మంటలు పెడుతూ
ఎక్కడ లేని తెగువుని చూపి తగువుకి లేస్తారే
జనాలు తలలర్పిస్తారే


సమూహ క్షేమం పట్టని స్వార్థపు ఇరుకుతనంలో ముడుచుకుపోతూ
మొత్తం దేశం తగలడుతోందని నిజం తెలుసుకోరేం
తెలిసీ భుజం కలిపి రారేం


అలాటి జనాల తరఫున ఎవరో ఎందుకు పోరాడాలి
పోరి ఏమిటి సాధించాలి


ఎవ్వరి కోసం ఎవరు ఎవరితో సాగించే సమరం
ఈ చిచ్చుల సింధూరం


జవాబు చెప్పే బాధ్యత మరచిన జనాల భారతమా!
ఓ అనాథ భారతమా!! .....................అర్థ...అన్యాయాన్ని సహించని శౌర్యం దౌర్జన్యాన్ని దహించే ధైర్యం
కారడవులలో క్రూర మృగంలా దాక్కుని ఉండాలా?
వెలుగుని తప్పుకు తిరగాలా?


శత్రువుతో పోరాడే సైన్యం శాంతిని కాపాడే కర్తవ్యం
స్వజాతి వీరులనణచే విధిలో కవాతు చెయ్యాలా?
అన్నల చేతిలో చావాలా?


తనలో ధైర్యం అడవికి ఇచ్చి తన ధర్మం చట్టానికి ఇచ్చి
ఆ కలహం చూస్తూ సంఘం శిలలా నిలుచుంటే


నడిచే శవాల సిగలో తురిమిన నెత్తుటి మందారం
ఈ సంధ్యా సిందూరం
వేకువ వైపా చీకటిలోకా ఎటు నడిపేనమ్మా
గతి తోచని భారతమా.................అర్థ...తన తలరాతను తనే రాయగల అవకాశాన్నే వదులుకుని
తనలో భీతిని తన అవినీతిని తన ప్రతినిధులుగ ఎన్నుకుని
ప్రజాస్వామ్యమని తలచే జాతిని ప్రశ్నించడమే మానుకొని
కళ్ళు ఉన్న ఈ కబోది జాతిని నడిపిస్తూందట ఆవేశం
ఆ హక్కేదో తనకే ఉందని శాసిస్తుందట అధికారం

కృష్ణుడు లేని కురుక్షేత్రమున సాగే ఈ ఘోరం
చితి మంటల సింధూరం
చూస్తూ ఇంకా నిదురిస్తావా విశాల భారతమా
ఓ విషాద భారతమా ......................అర్థ...

Labels:


 

విధాత తలపున ప్రభవించినది

పల్లవి:


అతడు:
విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం ఓం .........
ప్రాణనాడులకు స్పందన నొసగిన ఆది ప్రణవనాదం ఓం .........
కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం
ఎద కనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం


సరస స్వర సుర ఝురీ గమనమౌ సామవేద సారమిది
నేపాడిన జీవన గీతం ఈ గీతం


ఆమె:
విరించినై విరచించితిని ఈ కవనం
విపంచినై వినిపించితిని ఈ గీతం


ప్రాగ్దిశ వీణియపైన దినకర మయూఖ తంత్రులపైన్
జాగృత విహంగ తతులే వినీల గగనపు వేదికపైన
పలికిన కిల కిల స్వరముల స్వరజతి జగతికి శ్రీకారము కాగా
విశ్వకావ్యమునకిది భాష్యముగా ...........విరించినై....


జనించు ప్రతి శిశు గళమున పలికిన జీవననాద తరంగం
చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగ ధ్వానం
అనాది రాగం ఆది తాళమున అనంత జీవన వాహినిగా
సాగిన సృష్ఠి విలాసములే ..................విరించినై...


అతడు:
నా ఉచ్ఛ్వాసం కవనం - నా నిశ్వాసం గానం ...........సరస...

Labels:


Monday, 14 May, 2007

 

ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి

ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి
ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి ...
విశ్రమించవద్దు ఏ క్షణం - విస్మరించవద్దు నిర్ణయం
అప్పుడే నీ జయం నిశ్చయంరా ...
ఎప్పుడూ...............................
నింగి ఎంత గొప్పదైనా రివ్వుమన్న గువ్వపిల్ల
రెక్కముందు తక్కువేనురా
సంద్రమెంత పెద్దదైన ఈదుతున్న చేపపిల్ల
మొప్ప ముందు చిన్నదేనురా
పశ్చిమాన పొంచి ఉండి రవిని మింగు అసురసంధ్య
ఒక్కనాడు నెగ్గలేదురా
గుటకపడని అగ్గిఉండ సాగరాలనీదుకుంటు
తూరుపింట తేలుతుందిరా
నిశా విలాసమెంత సేపురా
ఉషోదయాన్ని ఎవ్వడాపురా
రగులుతున్న గుండెకూడా సూర్యగోళమంటిదేరా
ఎప్పుడూ.....................
నొప్పి లేని నిముషమేది జననమైనా మరణమైనా
జీవితాన అడుగడుగునా...
నీరసించి నిలిచిపోతే నిముషమైనా నీది కాదు
బ్రతుకు అంటే నిత్య ఘర్షణ
దేహముంది ప్రాణముంది
నెత్తురుంది సత్తువుంది
అంతకన్న సైన్యముండునా
ఆశ నీకు అస్త్రమౌను
శ్వాస నీకు శస్త్రమౌను
ఆశయమ్ము సారధౌనురా
నిరంతర ప్రయత్నమున్నదా
నిరాశకే నిరాశ పుట్టదా
ఆయువంటు ఉన్నవరకు
చావు కూడ నెగ్గలేక
శరము పైనె గెలుపు చాటురా
ఎప్పుడూ......................

Labels:


This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]